ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.7వేలు జమ, అర్హులైన రైతులు చనిపోతే ఇలా చేయండి

Date:

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ కానున్నాయి. ఆధార్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ స్టేటస్ తెలుసుకుని, మీ సేవ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకం కింద మొత్తం రూ.20 వేలు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత – సుఖీభవ’ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అవుతుండగా.. అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 19న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా కింద రూ.2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో నిధులు విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ‘అన్నదాత – సుఖీభవ’ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...