DTV DIGITAL LIVE 24X7

భారీ వర్షాలతో పొలాల్లో నిలిచిన నీరు.. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు కీలకం!

కృష్ణా: మురసు తీవ్ర తుఫాన్ ప్రభావం కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగంపై తీవ్ర ఆందోళన పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం ఎక్కువగా నమోదైన జిల్లాల్లో కృష్ణా కూడా ముందు వరుసలో ఉందని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.

పొలాల్లో నిలిచిన నీరు.. కంటిమీద కునుకు లేని రైతన్నలు

వర్షాల కారణంగా పొలాల్లోకి భారీగా నీరు చేరి నిలిచిపోవడంతో రైతులు పంటల పరిస్థితిని చూసి లబోదిబోమంటున్నారు. చేతికి అందే సమయానికి వర్షాలు ముంచెత్తడంతో రైతుల శ్రమ నీళ్లపాలైంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి పారుదల కాలువలు, డ్రైనేజీ మార్గాలు సక్రమంగా పనిచేసి నీరు త్వరగా బయటకు పోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యంగా మారింది..

త్రస్థాయి పరిశీలనలు.. త్వరలోనే పంట నష్టంపై స్పష్టత

పంట నష్టంపై క్షేత్రస్థాయి అంచనాలు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా పర్యటించి నష్టపోయిన పంట పొలాలను అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత నీరు నిలిచిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు, బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కృష్ణా జిల్లా రైతులకు తుఫాన్ అనంతర పరిస్థితులు మరో పెద్ద పరీక్షగా మారాయి. పంట నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేసి, నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణ పరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ తాజా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. DTV – మీ వార్తా ప్రపంచం

By dinesh