
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం TGTET-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వీసులో కొనసాగడం, ప్రమోషన్లు పొందడం కోసం టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షకు ప్రభుత్వ, లోకల్ బాడీ, TGREIS, సంక్షేమ, మోడల్ పాఠశాలలు తదితర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టెట్ అర్హత భవిష్యత్ DSC లేదా ప్రత్యక్ష నియామకాలకు వర్తించదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
పరీక్షను CBT విధానంలో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. దరఖాస్తులు జులై 22 నుంచి జులై 29, 2026 వరకు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించగా, ఫలితాలను సెప్టెంబర్ 28-30 మధ్య ప్రకటించనున్నారు. దరఖాస్తులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.

