
హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగులోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. యువ కథానాయకుడు తేజ సజ్జా వ్యాఖ్యాతగా ఈ షో తెలుగు వెర్షన్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
తెలుగు ‘ది ట్రైటర్స్’ అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ప్రైమ్ వీడియో తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌తో షోపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేసింది.
ఇక ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు సమాచారం. ఆటలో ఎవరు ‘ట్రైటర్స్’.. ఎవరు విశ్వసనీయమైన ప్లేయర్లు అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ షో సాగనున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగులో ‘ది ట్రైటర్స్’ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.
