భారత్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన మేలిమి బంగారం ధర.. నేడు మళ్లీ కొద్దిగా తగ్గింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా మారాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: భారత్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.330 తగ్గి రూ.1,49,240కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,800గా ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,930 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,49,240గా ఉండగా, 22 క్యారెట్ల ధర ₹1,36,800, 18 క్యారెట్ల ధర ₹1,11,930గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,49,240గా ఉంది. 22 క్యారెట్ల ధర ₹1,36,800 కాగా, 18 క్యారెట్ల ధర ₹1,11,930గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,49,240, 22 క్యారెట్ల ధర ₹1,36,800, 18 క్యారెట్ల ధర ₹1,14,500గా ఉంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, కేరళ, పుణెలో 24 క్యారెట్ల ధర ₹1,49,240, 22 క్యారెట్ల ధర ₹1,36,800, 18 క్యారెట్ల ధర ₹1,11,930గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర ₹1,49,390, 22 క్యారెట్ల ధర ₹1,36,950, 18 క్యారెట్ల ధర ₹1,12,080గా ఉంది. వడోదరాలో 24 క్యారెట్ల ధర ₹1,49,290, 22 క్యారెట్ల ధర ₹1,36,850, 18 క్యారెట్ల ధర ₹1,11,980గా నమోదైంది.
గమనిక: బంగారం ధరలు నగరం, మార్కెట్ పరిస్థితులు, పన్నులు, ఇతర ఛార్జీల ఆధారంగా మారవచ్చు. ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు సంబంధిత జువెల్లరీ దుకాణంలో తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.
