
మ సంస్థ తయారు చేస్తున్న ప్యాకేజ్డ్ తాగునీరు వినియోగానికి సురక్షితమైనదేనని బిస్లరీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చేపట్టే దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది. గోవాలోని తమ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రసాయనాల స్థాయులు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని ఆరోపణలు రావడంతో కంపెనీ స్పందించింది.
నీటి నమూనాల్లో రసాయనాల ఆనవాళ్లు?
గోవాలోని బిస్లరీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా, బ్రోమేట్ స్థాయులు అనుమతించిన పరిమితిని మించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన మరో పరీక్షలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్ఎస్) ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు.
కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి
పరీక్షల ఫలితాల ఆధారంగా బిస్లరీపై ప్రాసిక్యూషన్ చేపట్టేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం నేపథ్యంలో కంపెనీ తన వైఖరిని వెల్లడించింది. తమ ఉత్పత్తుల భద్రతపై నమ్మకం ఉందని పేర్కొంటూనే, అధికారుల విచారణకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో తదుపరి విచారణ, సంబంధిత పరీక్షల ఫలితాలు కీలకంగా మారనున్నాయి.



