అమెరికాకు చెందిన గాలారా విలియమ్స్ మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఉద్యోగం నుంచి ఒక్కసారిగా తొలగిస్తున్నట్టు ఆమెకు ఆ సంస్థ మెయిల్ పంపింది.

 ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు విడుదల చేస్తున్న ‘లేఆఫ్’ ప్రకటనలు చూస్తుంటే వారి గుండె గుభేల్ అంటోంది. దీనికి తగ్గట్టుగానే పలు సంస్థలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ‘ఇన్ని రోజులూ సేవలందించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని సంస్థలో కొనసాగించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అంటూ మెయిల్స్ పెట్టి అకస్మాత్తుగా గుడ్‌బై చెబుతున్నాయి. ఇదే తరహా అనుభవం మైక్రోసాఫ్ట్ ఉద్యోగినికి ఎదురైంది. రెండు దశాబ్దాలకు పైగా సంస్థ కోసం శ్రమిస్తే.. ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం తీసేశారంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది చర్చనీయాంశమైంది.

అమెరికాకు చెందిన గాలారా విలియమ్స్ మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు. తన నిరంతరం కృషితో ఆమె ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అయితే తాజాగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు విలియమ్స్‌కు ఒక్కసారిగా మెయిల్ వచ్చింది. అది చూసిన ఆమెకు షాక్ తగిలింది. ‘ఇటీవల నేను ఏఐపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాను. సరిగ్గా అప్పుడే నాకో మెయిల్ వచ్చింది. ఏంటా అని చూసి షాక్ అయ్యాను. నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు అందులో ఉంది. 24 ఏళ్లు కంపెనీ కోసం శ్రమించిన నాకు ఇది అవమానకర ముగింపు’ అంటూ విలియమ్స్ వాపోయారు.

ఈ ఘటనతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ‘లేఆఫ్‌’ ప్రకటనలతో ఉద్యోగుల జీవితాలు తలకిందులుగా మారుతున్నాయని నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ విడతల కింద ఉద్యోగులను తొలగిస్తోంది. ఒక్క జూలైలోనే 4,800 లేఆఫ్‌లు ప్రకటించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *