64 Invalid Postal Ballots in Kaikaluru Mandal; Both Valid Votes Go to TDP

ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదుకాగా, వాటిలో ఏకంగా 64 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

లెక్కింపులో కేవలం రెండు ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. విశేషమేమిటంటే, ఆ రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పోలైనవే.

https://dtvandhrapradesh.com

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కైకలూరు మండలంలో ఈ ఫలితం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.