
Ponguru Narayana: D news: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరుల సేవలను ఈ పవిత్రమైన రోజున స్మరించుకుందాం.
స్వాతంత్ర్యం మనకు కేవలం హక్కులను మాత్రమే కాదు.. దేశం పట్ల బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ఐక్యత, సమగ్రత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దేశ ప్రగతికి కృషి చేస్తూ, భావితరాలకు మరింత బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అందించేందుకు మనమంతా ముందుకు సాగుదాం.
ఈ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, దేశభక్తి నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

