యుకో బ్యాంక్ 2026-27 సంవత్సరానికి 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 8 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.16,650 స్టైపెండ్ చెల్లిస్తారు..

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 8
  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 8
  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 21
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 11
  • కేరళలో పోస్టుల సంఖ్య: 10
  • ఉత్తరప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 45
  • పశ్చిమ బెంగాల్‌లో పోస్టుల సంఖ్య: 86
  • బీహార్‌లో పోస్టుల సంఖ్య: 34

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రాష్ట్రంలోని స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 అక్టోబర్ 1 నాటికి వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం 10 నుంచి 15సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం యుకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమర్పించే ముందు విద్యార్హతలు, వయసు, స్థానిక భాష, రాష్ట్రాల వారీగా ఖాళీలు, ఇతర అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌తో సరిపోల్చుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.800 + జీఎస్‌టీ, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 + జీఎస్‌టీ, జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులు రూ.600 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞాన పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. సంబంధిత రిజర్వేషన్ నిబంధనలు కూడా వర్తిస్తాయి. అర్హతలు, ఎంపికకు సంబంధించిన పూర్తి నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.16,650 స్టైపెండ్ చెల్లిస్తారు. అప్రెంటిస్‌షిప్ సమయంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు, కార్యాలయ విధానాలు, కస్టమర్ సేవలకు సంబంధించిన ప్రాయోగిక అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2026
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2026
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 7 నవంబర్ 2026

పరీక్ష విధానం

ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 100 మార్కులకు, 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ఫైనాన్స్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25 మార్కులు, ఇంగ్లిష్/హిందీ భాష విభాగం నుంచి 25 మార్కులు, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 మార్కులు చొప్పున అడుగుతారు. ప్రతి విభాగానికి కేటాయించిన అంశాలపై అభ్యర్థులు ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వడం మంచిది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *