Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్

Date:

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఇష్ట దైవంగా పూజిస్తారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిరంజీవి తన ట్విట్టర్ (ఎక్స్ ) లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు. తన ప్రతి పనిలోనూ హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయని ఆయన బలంగా నమ్ముతుంటారు. చిరంజీవి మాతృమూర్తి పేరు అంజనా దేవి కాగా, తన ఇంటికి ఏకంగా అంజనాద్రి అని పేరు పెట్టుకున్నారు మెగాస్టార్ ఇదిలా ఉంటే ఇవాళ (ఏప్రిల్ 02) హనుమాన్ జయంతి.

ఈ సందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా హనుమంతుడికి సంబంధించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) అభిమానులతో పంచుకున్నారు.

తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ వీడియోలో చూపించిన చిరంజీవి.. ‘ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...