ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!

Date:

చూస్తుండగానే జనం ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు. రాత్రి వరకు బాగున్న వాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. చందాపురంలో మొదలైన ఈ అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని కూడా చుట్టేసింది. అధికారులు హోటళ్లు మూయించారు, మాంసం అమ్మకాలు ఆపించేశారు. అయినా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతుంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ గడపను అంతుచిక్కని అనారోగ్య సమస్య వణికిస్తోంది. చందాపురం గ్రామంలో మొదలైన అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని చుట్టేసింది. ఒక్కొక్కరుగా జనం మంచాన పడుతున్నారు. వాంతులు.. విరోచనాలతో బాధితులు విలవిలలాడుతున్నారు. మొదట్లో ఒకరిద్దరితో మొదలైన ఈ అస్వస్థత. చూస్తుండగానే ఊరంతా పాకింది.

ప్రస్తుతం ఈ సంఖ్య 60కి చేరింది. బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. చందాపురం గ్రామంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. నందిగామ పట్టణంలోని హోటల్స్, కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సహా అనేక ఆహార దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

అస్వస్థతకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ఆహార పదార్థాలు, తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాంబ్‌కు పంపించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...