
శావల్యాపురం మండల పరిషత్‌ను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ నుంచి 10 మంది, జనసేన నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి పులివర్తి ప్రకాష్ మంగళవారం ప్రకటించారు.
టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా కొత్తలూరు నుంచి పోటీ చేసిన గుంటూరు సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీడీపీ తరఫున పొట్లూరు నుంచి గోనుగుంట్ల హనుమంతురావు, శావల్యాపురం నుంచి రెడ్డి పద్మ, కారుమంచి-1 నుంచి యరమాసు అనంతమ్మ, గుంటుపాలెం నుంచి సల్లూరి మరియమ్మ, కనమర్లపూడి నుంచి బండారు భవాని, వేల్పూరు-1 నుంచి దొడ్డా ఏడుకొండలు, వేల్పూరు-2 నుంచి బొజ్జా వెంకయ్య, శానంపూడి నుంచి కల్పకూరి చిన్నశీను, కారుమంచి-2 నుంచి ముప్పా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జనసేన తరఫున మతుకుమల్లి ఎంపీటీసీ స్థానం నుంచి అడపాల అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. దీంతో శావల్యాపురం మండలంలోని మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలూ ఏకగ్రీవమైనట్లు స్పష్టమైంది.
