D Spiritual: Nov 2: Amit Shah Hyderabad Visit: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.

అమిత్ షా వెంట బీజేపీ ముఖ్య నేతలు

అమిత్ షాతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తదితర నాయకులు ఆలయాన్ని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శన సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా అమిత్ షా వెంట ఉన్నారు.