ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌లో సంచలనం సృష్టించిన బాల్ టాంపరింగ్ వివాదం (శాండ్ పేపర్ గేట్) మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ ఖండించగా.. మరో మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ మాత్రం ఖవాజాకు మద్దతుగా నిలిచాడు. ఈ పరిణామాలతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో చర్చ మొదలైంది. మరోవైపు ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరోసారి విచారణ చేపడతామని ప్రకటించింది. తాజాగా ఈ వివాదంపై మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్పందించాడు. ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించలేదని అభిప్రాయపడ్డాడు.

నిష్పక్షపాత విచారణ జరగాలి

శాండ్ పేపర్ గేట్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టనున్న దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని హెడెన్ సూచించాడు. ఈ విచారణను క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించినా లేదా స్వతంత్ర సంస్థకు అప్పగించినా.. సరైన ప్రశ్నలు అడిగి వాస్తవాలను వెలికితీయాలని పేర్కొన్నాడు.

అందరికీ తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి

ఈ వ్యవహారంలో ప్రస్తుత ఆటగాళ్లతో పాటు అప్పటి సిరీస్‌లో పాల్గొన్న డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా సహా సంబంధిత ప్రతి ఒక్కరినీ విచారించాలని హెడెన్ అభిప్రాయపడ్డాడు. అందరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించే విధంగా విచారణ ప్రక్రియ ఉండాలని సూచించాడు. లేదంటే క్రికెట్ వ్యవస్థపై నెలకొన్న అనుమానాలు, అపనమ్మకం మరింత కొనసాగుతాయని హెచ్చరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *