D Educt: Nov 2: APOSS Admissions: ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు.. నవంబర్ 15 వరకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్. నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలస్య రుసుముతో నవంబర్ 30 వరకు అవకాశం

నవంబర్ 15వ తేదీలోగా ప్రవేశాలు పొందలేని అభ్యర్థులు రూ.200 ఆలస్య రుసుము చెల్లించి నవంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోగా ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.