రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు పలు చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ముఖ్యంగా పలు కార్పొరేషన్లలో కూటమి మేయర్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

గుంటూరు కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఏలూరులో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి, విజయనగరంలో అవనాపు భార్గవి ముందంజలో కొనసాగుతున్నారు.

అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లో కటారి హేమలత తిరుపతిలో జేబీ శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ టీడీపీ అభ్యర్థులే. మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీ ఖాతా తెరిచింది.

ఇప్పటికే మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి పి. వెంకటరమణ 191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 318 ఓట్లు రాగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి 127 ఓట్లు వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల ఫలితాల సరళిపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వార్డులు కార్పొరేషన్ల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది.

By Rajini