రైలు ప్రయాణికులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల మధ్య తుది దశకు చేరుకున్న మరో కొత్త రైల్వే లైన్

Date:

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త రైల్వే లైన్.. నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటోంది. కాజీపేట-విజయవాడ మధ్య కీలక మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 219 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే లైన్‌ అందుబాటులోకి వస్తే.. తెలంగాణ, ఏపీ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ మార్గం ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా కీలకంగా మారనుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే కీలకమైన విజయవాడ-కాజీపేట మార్గంలో మూడో రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలక అప్‌డేట్ వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో అత్యంత రద్దీగా ఉండే ఈ విజయవాడ-కాజీపేట మార్గంలో మరిన్ని రైళ్ల రాకపోకలు సాగించేందుకు వీలుగా.. రైల్వే శాఖ చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన చివరి దశకు చేరుకుంది. విజయవాడ నుంచి కాజీపేటకు మొత్తం 219 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టులో ఇప్పటికే 199 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణంతోపాటు.. విద్యుదీకరణ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

చిన్న చిన్న పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన రైల్వే శాఖ పూర్తి చేస్తోంది. త్వరలోనే విజయవాడ-కాజీపేట మధ్య పూర్తి స్థాయి రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. ఏపీ, తెలంగాణ మధ్య రవాణా రంగంలో సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ మార్గంలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది.

విజయవాడ-కాజీపేట కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రైల్వే లైన్.. విజయవాడ-కాజీపేట మధ్య నిత్యం కొనసాగే రైళ్ల రద్దీని గణనీయంగా తగ్గించనుంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రైళ్లు ఆలస్యం కాకుండా మరింత వేగంగా.. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఈ విజయవాడ-కాజీపేట మార్గం బొగ్గు, సిమెంట్ రవాణాకు అత్యంత కీలకంగా ఉంది. ఈ కొత్త లైన్ ద్వారా గూడ్స్ రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమైతే.. పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు కూడా సరైన సమయానికి చేరనున్నాయి. ఈ మార్గంలో పూర్తి స్థాయి విద్యుదీకరణ కారణంగా ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా.. పర్యావరణహితమైన రవాణా అందుబాటులోకి రానుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...