
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో ఎస్పీఎస్ఆర్ ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాపూరు, కలువాయి మండలాల ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్న ఆయన గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
ఈ సందర్భంగా ధనంజయరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
for more:Mptc Zptc election ubdates only in dtv digital
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు విలువను గుర్తించాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
