ఏపీలోని 100 పట్టణ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు రేపు (నవంబర్ 23) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో తొలి సమావేశాలు జరగనున్నాయి.

ఏపీలోని 100 పట్టణ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు రేపు (నవంబర్ 23) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో తొలి సమావేశాలు జరగనున్నాయి. తొలి సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ జరగనుంది.

విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్లలో తొలి సమావేశాలు జరగనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లలోనూ రేపే (సోమవారం) డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. రేపటి తొలి సమావేశం నుంచే రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల నిర్వహణ, ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *