: High Tension in Kadapa: Petrol Bomb Attacks Reported During TDP-YSRCP Clash

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహానికి గురైన ఇరు పార్టీలకు చెందిన వర్గాలు పరస్పరం పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడినట్లు సమాచారం.

for more:Mptc zptc election ubdates in dtv digital

ఈ ఘటనతో ఎర్రపల్లెలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ హింసాత్మక పరిణామాలు స్థానికంగా కలకలం రేపాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://dtvandhrapradesh.com