చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని తయ్యూరులో స్థానిక పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

https://dtvandhrapradesh.com