
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల పోలింగ్ కేంద్రం వద్ద జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ అభ్యర్థి భర్తను ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, చివరకు తోపులాటకు దారితీసింది. దీంతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
