త్వరగా ముసలితనం వచ్చేలా చేసే ఆహారాలు, కొన్ని ఫుడ్స్‌ దూరం పెడితే చాలు

Date:

వయసు పెరగడం మన చేతుల్లో లేని అంశం కావచ్చు కానీ యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడమనేది ఖచ్చితంగా మన చేతుల్లో ఉండే అంశం. వాస్తవానికి యవ్వనం అనేది మన జన్యువుల్లో కంటే మనం రోజూ తినే ఆహారంలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం చేసే చిన్న చిన్న ఆహారపు అలవాట్లే మనల్ని వయసు కంటే ముందే ముసలివారిగా మార్చేస్తున్నాయి. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, నీరసంగా, వృద్ధాప్య ఛాయలతో ఉండే చేస్తున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టి యవ్వనంగా ఉండాలంటే మొదట మనం కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

తద్వారా చిన్న వయసులో ముడతలు, నీరసమైన చర్మంతో ఇబ్బంది పడేలా చేస్తున్నాయని డాక్టర్‌ రేష్మ ఏ ఎమ్‌, కన్సల్టెంట్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైట్‌ సైన్స్‌ అంటున్నారు. ఈ సమస్యలను అధిగమించాలంటే త్వరగా ముసలితనం తెప్పించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్‌ రేష్మ ఏఎం, కన్సల్టెంట్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైట్‌ సైన్స్‌ చెబుతున్న దాని ప్రకారం.. వయసు పైబడటం లేదా వృద్ధాప్యం అనేది కేవలం జన్యువులపైన మాత్రమే ఆధారపడి ఉండదు. మనం తీసుకునే అహారపు అలవాట్లు, జీవనశైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను పెంచడం ద్వారా కణాల వృధ్యాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

ముఖ్యంగా రిఫైన్డ్‌ షుగర్స్‌, వేయించిన ఆహారపదార్థాలు, ప్రాసెస్‌ చేసిన మాసం, ట్రాన్స్‌ఫాట్‌ అధికంగా ఉండే స్నాక్స్‌ వంటివి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలోని కొల్లాజెన్‌ దెబ్బతింటుంది. దీనివల్ల ముఖంపై ముడతలు పడటం, చర్మం కాంతి విహీనంగా మారడం, చర్మం స్థితిస్థాపకతను కోల్పోవడం వంటి అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లైకేషన్‌ అనే ప్రక్రియ మొదలవుతుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...