టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

Date:

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి వేదికను నెల్లూరుకు మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన కారణంగా వేదికను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు వేదిక మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం శ్రీకాకుళంలో మహానాడు నిర్వహించాలని ప్లాన్ చేసింది. మహానాడు కార్యక్రమాన్ని మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు సిక్కోలులో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో ఈ వేడుకను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. అయితే తాజాగా మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ పర్యటన కారణంగానే మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

జూన్ నెలలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని ఉత్తరాంధ్రలో పలు కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని మోదీ వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అటు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ఇటు డీపీ మహానాడు నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చాలని భావిస్తున్నారట. ఒకవేళ శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మారిస్తే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి అంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...