ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కైవసం చేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) స్వగ్రామమైన నిమ్మకూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

https://dtvandhrapradesh.com

పామర్రు నియోజకవర్గ పరిధిలోని నిమ్మకూరు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసిన మాచర్ల కల్పన 560 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిపై విజయం నమోదు చేశారు.

ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.