Hindupur Counting Centre Tension: YSRCP Leaders Protest Alleged Interference by Balakrishna's PA

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ లోపలే ఉండి అధికారులపై ప్రభావం చూపుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

https://dtvandhrapradesh.com

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రంలోకి మీడియా ప్రతినిధులకు సైతం అనుమతి నిరాకరించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.