ఢిల్లీతో పోరాడండి.. మీ వెంట మేమున్నాం”: మమతా బెనర్జీకి బంగ్లా మంత్రి సంచలన మద్దతు

Date:

పశ్చమి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓటు హక్కును కాలరాశారంటూ.. బంగ్లాదేశ్ ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ విషయంలో తాము తలదూర్చమని చెబుతూనే.. బెంగాల్ ఓట్ల తొలగింపు తమ దేశంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని.. కానీ తమ మద్దతును కోల్పోలేదని చెప్పారు. ఆమె కచ్చితంగా ఢిల్లీతో పోరాటం చేయాలని.. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఆమె వెనుకే ఉన్నారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకంపనలు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌కు చేరాయి. బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మైనారిటీల పరిస్థితిపై బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది మంది ముస్లింలు, మతువా కమ్యూనిటీ ప్రజల ఓటు హక్కును అన్యాయంగా హరించారని ఆయన ఆరోపించారు. అలాగే తాము మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఆమె న్యాయ పోరాటం చేయాలని.. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ముస్లిం సోదరులు ఆమె వెనుకే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.

భారత్ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెబుతూనే.. సరిహద్దు రాష్ట్రమైన బంగ్లాదేశ్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నహీద్ ఇస్లాం ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని.. తమ మద్దతును కోల్పోలేదని చెప్పారు. అలాగే ఢిల్లీతో ఆమె కచ్చితంగా పోటీ చేయాలని.. దీదీ వెనుక తమ దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని చెప్పారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....