PM Modi: శిథిలాల నుంచి శిఖరానికి.. సోమనాథ్ 1000 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ మనోగతం

Date:

భారతీయ చైతన్యానికి, అజేయమైన సంకల్పానికి నిదర్శనమైన సోమనాథ క్షేత్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. మే 11న నరేంద్ర మోదీ సోమనాథ్‌ను సందర్శించనున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునరుద్ధరించిన ఆలయం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని రాసిన ప్రత్యేక సంపాదకీయం భారతీయ నాగరికత గొప్పతనాన్ని, విద్వంసం నుంచి సృజన వైపు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించింది. “తుఫానులు ఎంత భయంకరంగా ఉన్నా, అలలు ఎంత ఉధృతంగా ఉన్నా, గౌరవంతో తిరిగి పుంజుకోవచ్చని సోమనాథ్ తీరంలోని అలలు మనకు చెబుతాయి” అంటూ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు.

2026 ప్రారంభంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని, ఇప్పుడు పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన వేళ అక్కడకు రావడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. సోమనాథ్‌ను కాపాడేందుకు, పునర్నిర్మించేందుకు శతాబ్దాలుగా కృషి చేసిన మహనీయులను ప్రధాని.

ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహారాజు ధరాసేన, రాజా భోజుడు, సిద్ధరాజ జయసింహ వంటి రాజుల సహకారాన్ని గుర్తు చేశారు. దండయాత్రల నుండి నాగరికతను కాపాడిన భీమదేవ, హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి వీరుల త్యాగాలను కొనియాడారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ ఆలయ వైభవాన్ని నిలబెట్టిన పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....