గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

Date:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది. ప్రధానంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ, యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.రాష్ట్రంలో క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేసేందుకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

“గ్రామ, పట్టణ స్థాయిలో ప్రభుత్వ పనితీరు ప్రజలకు నేరుగా అనుభవంలోకి రావాలి. మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి” అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచవద్దని, స్థానిక ఎన్నికల నాటికి ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి ఉండాలని స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....