తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా, సుదీర్ఘమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, విజయాలు కలగాలని, రాబోయే ఏడాది అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన ఈ శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

By Rajini