
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
