ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ 406 స్థానాల్లో విజయం సాధించింది.

వైసీపీ 76 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా జనసేన 73 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 20 స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ(ఎం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా ఆప్, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి.

జిల్లాల వారీగా చూస్తే నెల్లూరు జిల్లాలో మొత్తం 30 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 26 స్థానాలను గెలుచుకుంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 22 చొప్పున, శ్రీ సత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 21 చొప్పున స్థానాలను కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలోని 7,768 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాల్లోనూ కూటమి పార్టీలు ఆధిక్యాన్ని ప్రదర్శించాయి.

టీడీపీ ఏకంగా 4,806 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 938 స్థానాలను దక్కించుకోగా వైసీపీ 1,711 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 117 స్థానాల్లో విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు 162 స్థానాలను కైవసం చేసుకోగా సీపీఐ(ఎం) 15, కాంగ్రెస్ 9, బీఎస్పీ 3, ఇతర పార్టీలు 7 స్థానాల్లో గెలుపొందాయి.

జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో టీడీపీ 392 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా ఏలూరు జిల్లాలో వైసీపీ 107 స్థానాలతో తన ప్రభావాన్ని చూపింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోగా కూటమి పార్టీలకు గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *