D Spiritual: Nov 9: తిరుమల, నవంబరు 09, 2026: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీన పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నవంబరు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

పుష్పయాగ మహోత్సవం సందర్భంగా నవంబరు 16వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *