ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు, పార్టీ శ్రేణులతో సోమవారం బొబ్బిలి కోట సందడిగా మారింది. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు, వారి అనుచరులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కోటకు చేరుకున్నారు. దీంతో కోట ప్రాంగణం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా విజేతలు తమకు పార్టీ టికెట్లు కేటాయించి గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన ఎమ్మెల్యే బేబీనాయన బుడా చైర్మన్ తెంటు లక్ష్ము నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. వారిని గజమాలలతో ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యకర్తల నినాదాలతో కోట ప్రాంగణం మార్మోగింది.

అనంతరం బేబీనాయన, తెంటు లక్ష్ము నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల్లో ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు, మద్దతుదారులందరికీ అభినందనలు తెలిపారు.

ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులంతా బాధ్యతతో వ్యవహరించాలని వారు సూచించారు. ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హితవు పలికారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని విజేతలకు సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *