Sharwanand’s Bhogi Release Postponed? CBFC Refers Sampath Nandi’s Film to Revising Committee

టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి వెంటనే సర్టిఫికెట్ జారీ చేయకుండా, రివైజింగ్ కమిటీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వాయిదా పడిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్

‘భోగి’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముందుగా నిర్ణయించింది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ట్రైలర్ లాంచ్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే అనూహ్య సాంకేతిక కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేయాల్సి రావడం పట్ల అభిమానులకు క్షమాపణలు తెలిపింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.

CBFC నిర్ణయంతోనే వాయిదా?

సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిన నేపథ్యంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. సెన్సార్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘భోగి’ విడుదల వాయిదా వార్తలపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *