
D Spiritual: Nov 10: టీటీడీకి రెండు నగదు లెక్కింపు యంత్రాల విరాళం
తిరుపతికి చెందిన వీకేఆర్ఆర్ ఫ్యూయల్ స్టేషన్ గ్రూప్స్ యజమాని శ్రీ మనోజ్ కుమార్ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రెండు నగదు లెక్కింపు యంత్రాలను విరాళంగా అందించారు.
వీటిలో ఒక యంత్రాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి, మరో యంత్రాన్ని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి కేటాయించారు.
ఈ యంత్రాలను తిరుచానూరు ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులకు అందజేశారు. త్వరలోనే వీటిని సంబంధిత రెండు ఆలయాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల వినియోగంతో హుండీ ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. నగదు లెక్కింపులో సమయం ఆదా కావడంతో పాటు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు దోహదపడనుంది.
