D Educt: Nov 10: ICSE, ISC 2027 పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి (ICSE), 12వ తరగతి (ISC) వార్షిక పరీక్షల కాలపట్టికను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది.

ఫిబ్రవరి 15 నుంచి ఐసీఎస్‌ఈ పరీక్షలు

2027 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానున్న పదో తరగతి (ICSE) పరీక్షలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ వార్షిక పరీక్షలకు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కలిపి మొత్తం 3,79,980 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

పారదర్శకంగా పరీక్షల నిర్వహణ

పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు CISCE బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన చర్యలు చేపడుతోంది.

విద్యార్థులు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను CISCE అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి, తమ ప్రిపరేషన్‌ను అందుకు అనుగుణంగా కొనసాగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *