
D Educt: Nov 10: పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రభుత్వ నిరాకరణ
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ కోటా ద్వారా భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.
గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన అనుమతిని ఈ విద్యా సంవత్సరానికి కూడా పొడిగించాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించలేదు.
ఏపీపీజీసెట్, ఏపీపీజీఈసెట్, ఐసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించినప్పటికీ కన్వీనర్ కోటాలో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా సాధారణ పీజీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో భారీగా సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి.
