
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో గురువారం ఉదయం బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే పది గ్రాములపై ఏకంగా రూ.2,180 తగ్గింది.
అదేవిధంగా ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,28,150గా ఉంది. గత రోజుతో పోలిస్తే రూ.2,000 తగ్గింది.
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు ఈ తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ దుకాణాల్లో తాజా ధరలను పరిశీలించడం మంచిది.
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| విశాఖపట్నం | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| అమరావతి | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| కాకినాడ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| తిరుపతి | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| వరంగల్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| నిజామాబాద్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
| ఖమ్మం | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
