D Spiritual: Nov 12: భక్తులతో కిటకిటలాడిన మంత్రాలయం.. రాఘవేంద్ర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు!

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం భక్తుల సందడితో కళకళలాడింది. గురువారం కావడంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి తరలివచ్చారు. దీంతో మఠం పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి.

మంత్రాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందించి ఆశీర్వదించారు. అలాగే ముద్రాధారణ చేసి భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు. గురువారం సందర్భంగా మంత్రాలయంలో భక్తుల రద్దీ నెలకొనడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *