తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంగీతానికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తులసి పాత్రలో నటించిన మంజు భార్గవి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

అయితే ఈ సినిమాలో తులసి పాత్ర కోసం మొదట్లోనే మంజు భార్గవి పేరు ఖరారు కాలేదట. మరో ప్రముఖ నటి కూడా ఈ పాత్రలో నటించాలని ఎంతో ఆసక్తి చూపించారట. ఆమె మరెవరో కాదు.. అప్పటికే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజు భార్గవి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శంకరాభరణం సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, ఆ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు.

తులసి పాత్ర కోసం జయప్రద ప్రయత్నం!

దర్శకుడు కె. విశ్వనాథ్ శంకరాభరణం కథను సిద్ధం చేసుకున్న సమయంలో సినిమాలోని పాత్రలకు కొత్త నటీనటులను తీసుకోవాలని భావించారట. అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల కంటే పాత్రలకు సరిపోయే కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో తులసి పాత్ర కోసం జయప్రద కూడా ప్రయత్నించారని మంజు భార్గవి వెల్లడించారు.https://dtvandhrapradesh.com/

అంతకుముందు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరిసిరిమువ్వ’ సినిమాలో జయప్రద నటించినప్పటికీ, శంకరాభరణంలోని తులసి పాత్రకు మాత్రం ఆమెను ఎంపిక చేయలేదని తెలిపారు. చివరకు ఈ పాత్ర మంజు భార్గవిని వరించింది. ఆమె తనదైన నటన, హావభావాలతో తులసి పాత్రకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.

మంజు భార్గవిపై విశ్వనాథ్‌కు మొదట్లో సందేహాలు!

మంజు భార్గవి గతంలో చేసిన సినిమాల్లోని పాత్రలు, డ్యాన్స్‌ల కారణంగా కె. విశ్వనాథ్‌కు ఆమెపై కొన్ని సందేహాలు ఉండేవని ఆమె వెల్లడించారు. ‘ప్రెసిడెంట్ పెరమ్మ’, ‘గాలిపటాలు’ వంటి సినిమాలతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’లో రంభ పాత్రలో ఆమె కనిపించారు. అంతేకాకుండా పలు పౌరాణిక చిత్రాల్లో రంభ, ఊర్వశి, మేనక వంటి పాత్రలు పోషించారు.

ఆ సినిమాల్లో ఆమె చేసిన నృత్యాలు, పాత్రలు చూసిన విశ్వనాథ్.. శంకరాభరణంలోని తులసి వంటి సున్నితమైన పాత్రకు ఆమె ఎంతవరకు సరిపోతారో తెలుసుకోవాలనుకున్నారట. అందుకే ‘ప్రెసిడెంట్ పెరమ్మ’ సినిమాలో ఒక చిన్న క్లాసికల్ డ్యాన్స్ పాత్రను ఇచ్చి ఆమె సామర్థ్యాన్ని పరీక్షించారని మంజు భార్గవి తెలిపారు.

ఆ తర్వాత శంకరాభరణం కోసం మంజు భార్గవి, సోమయాజులు గారిని మేకప్ టెస్ట్‌కు పిలిచారు. ఈ మేకప్ టెస్ట్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర ఇంటి మేడపై నిర్వహించారట. టెస్ట్ వీడియోను పరిశ్రమలోని పలువురికి చూపించినప్పుడు, అందులో కనిపించినది మంజు భార్గవి అని చాలామంది గుర్తించలేకపోయారట. ఆమె గతంలో కనిపించిన రూపానికి పూర్తి భిన్నంగా కొత్తగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారట.

దీంతో కె. విశ్వనాథ్ ఎంతో సంతోషించారని మంజు భార్గవి గుర్తుచేసుకున్నారు. తన ప్రయోగం విజయవంతమైందని ఆయన భావించారట. ప్రేక్షకులు కూడా తనను తులసి పాత్రలో పూర్తిగా అంగీకరిస్తారని ఆయనకు నమ్మకం కలిగిందని ఆమె వివరించారు.

సినిమాలంటే ఇష్టం లేదు.. డ్యాన్స్ అంటే ప్రాణం!

మంజు భార్గవి చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదట్లో ఆమెకు సినిమా పరిశ్రమపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. సినిమాలంటేనే ఇష్టం లేదని, తన వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉండేదని ఆమె తెలిపారు. తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడే వ్యక్తినని, సినిమా పరిశ్రమలో ఉండే వాతావరణానికి తన ఆలోచనా విధానం భిన్నంగా ఉండేదని చెప్పారు.

అయితే చిన్నప్పటి నుంచే ఆమెకు నృత్యంపై అమితమైన ఆసక్తి ఉండేది. కేవలం ఐదేళ్ల వయసు నుంచే వేదికలపై సోలో డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేవారట. చిన్నతనంలోనే పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు వేంపటి చిన్నసత్యంతో ఆమె కుటుంబానికి మంచి అనుబంధం ఉండేదట. ఆయన తన తండ్రికి అత్యంత సన్నిహితుడని, తాను పుట్టినప్పుడు ఆసుపత్రిలో తనను మొదట ఎత్తుకున్న వ్యక్తి కూడా ఆయనేనని మంజు భార్గవి గుర్తుచేసుకున్నారు.https://dtvandhrapradesh.com/

ఆ అనుబంధంతోనే చెన్నైలోని ఆయన పాఠశాలలో నృత్యం నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపారు. ముఖ్యంగా కూచిపూడి నృత్యం తన నటనా జీవితానికి ఎంతో ఉపయోగపడిందని ఆమె చెప్పారు.

డ్యాన్స్ వల్లే నటన సులభమైంది!

శంకరాభరణం సినిమాలో తులసి పాత్రకు ఎక్కువగా సంభాషణలు లేకపోయినా, కేవలం ముఖ కవళికలు, కళ్లతో పలికించే భావాలు, శరీర భాష ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో తనకు నృత్యం ఎంతో సహాయపడిందని మంజు భార్గవి తెలిపారు.

For more ubdates visit :https://dtvandhrapradesh.com/

ఒక నృత్యకారిణిగా భావాలను వ్యక్తపరచడంలో తనకు చిన్నప్పటి నుంచే అనుభవం ఉండేదని, అందుకే త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *