వాడికి ఫుల్లుగా మందు తాగించి పడుకోబెట్టు.. తర్వాత ఆ పని కానిద్దాం.. లవర్‌తో సంధ్య మాట్లాడిన ఆడియో వైరల్

Date:

నిజామాబాద్ జిల్లా న్యాల్‌కల్‌లో వివాహేతర సంబంధం కోసం భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రియుడి మోజులో పడిన సంధ్య, తన ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రశాంత్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు భర్తకు మద్యం తాగించి, అనంతరం టాయిలెట్ క్లీనర్‌ను ఇంజెక్ట్ చేసి ప్రాణాలు తీసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వైరల్ ఆడియో ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

నిజామాబాద్ జిల్లా న్యాల్‌కల్‌లో ఘోరం జరిగింది. ప్రియుడి మోజులో పడిన సంధ్య అనే మహిళ భర్త ప్రాణాలు తీసింది. తన ప్రియుడు అనిల్, అతని స్నేహితుడు వెంకటసాయితో కలిసి భర్త ప్రశాంత్‌ను కిరాతకంగా హత్య చేసింది. గతంలో ప్రశాంత్‌కు మద్యం తాగించి దాబా పైనుంచి తోసేసి హత్య చేయడానికి ప్రయత్నించగా, అతడు గాయాలతో బయటపడ్డాడు. మరుసటి రోజు మళ్లీ మద్యం తాగించి, ప్రశాంత్ నరాల్లోకి టాయిలెట్ క్లీనర్‌ను ఇంజెక్ట్ చేసి ప్రాణాలు తీసింది. అయితే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ప్రశాంత్‌ను సంధ్య అనే మహిళ హత్య చేయించిన సంఘటనలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. ఈ కేసులో భార్య సంధ్య ఆడియో వైరల్‌గా మారింది. అందులో తన ప్రియుడు బంటితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. “వాడికి బాగా తాగించి పడుకోబెట్టు, సరిపోకపోతే ఇంకా తెప్పించు.. వాడు కిందకి రావొద్దు.. డిచ్ కావాలే” అని భర్త హత్యకు ముందు ఆమె పథకం పన్నినట్లు ఆడియోలో మాట్లాడింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి.

సోమవారం నిజామాబాద్‌‌‌‌ సౌత్‌‌‌‌ సీఐ సురేశ్​ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌‌‌‌కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్​(35) మూడేండ్ల క్రితం దుబాయ్‌‌‌‌కు వలస వెళ్లాడు. అతను దుబాయ్ వెళ్లిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్‌‌‌‌లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన అనిల్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. మూడేళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్‌‌‌‌ నుంచి ఇంటికి తిరిగివచ్చాడు. అయితే.. వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య.. ప్రియుడు అనిల్‌‌‌‌తో కలిసి హత్య చేసింది..

ప్రియుడి మోజులో రెండు సార్లు.. ప్లాన్

ప్రియుడు అనిల్ తో కలిసి రెండు సార్లు భర్తపై హత్య యత్నం చేసింది సంధ్య.. ప్రియుడు అనిల్, అతని స్నేహితుడి వెంకట సాయి తో కలిసి భర్తకు మద్యం తాగించి దాబా పై నుండి తోసింది సంధ్య .. అయితే.. ప్రశాంత్ గాయాలతో బయట పడ్డాడు.. మరునాడు మద్యం తాగించి ప్రశాంత్ నరాలలో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి చంపినట్లు పోలీసులు తెలిపారు. భార్య సంధ్య, ప్రియుడు అనిల్ , వెంకట సాయి లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....