ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా లీటర్ పాలపై రూ.9 చొప్పున ధర పెంచనున్నారు.

కొంతకాలంగా పాల ధరలు పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరగ్గా.. చివరకు లీటర్‌కు రూ.9 పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా చేసే ధరలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం లీటర్ పాలకు చెల్లిస్తున్న ధరపై మరో రూ.9 పెంచేందుకు అనుమతి ఇచ్చారు.

ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాలకు ప్రభుత్వం లీటర్‌కు రూ.54.60 చొప్పున చెల్లిస్తోంది. అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని, సరఫరా ధరను పెంచాలని కేఎంఎఫ్ కొంతకాలంగా కోరుతోంది.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్), కేఎంఎఫ్ మధ్య గత నాలుగు నెలలుగా చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో పాల ధరల పెంపునకు మార్గం సుగమమైంది.

గత నెలలోనే ఏపీ ప్రభుత్వం లీటర్ పాలపై రూ.5 పెంచేందుకు అంగీకరించినప్పటికీ.. ఆ ధరకు పాలు సరఫరా చేసేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) అంగీకరించలేదు. దీంతో తాజాగా మరోసారి చర్చలు జరిపిన అధికారులు.. లీటర్‌కు రూ.9 పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉంది. మరో రెండు రోజుల్లో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,547 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సుమారు 23.50 లక్షల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) కేఎంఎఫ్ నుంచి పాలను కొనుగోలు చేస్తోంది. 200 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు, ఒక లీటర్ సామర్థ్యం కలిగిన టెట్రా ప్యాకెట్లలో పాలను సేకరించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది.

పాల ధరల పెంపుతో అదనపు భారం

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.38 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా లీటర్‌కు రూ.9 చొప్పున ధర పెంచడంతో ఏడాదికి దాదాపు రూ.75 కోట్ల మేర అదనపు వ్యయం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అంగన్‌వాడీలకు పాల సరఫరా కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.456 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతిపాదిత ధరల పెంపు అమల్లోకి వస్తే ఈ వ్యయం రూ.531 కోట్లకు చేరనుంది. దీంతో అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పాల సరఫరాపై ప్రభుత్వ ఖర్చు మరింత పెరగనుంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నవజాత శిశు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, నిరంతర వైద్య సేవలు అందించడం, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా ఈ నెల 21వ తేదీ వరకు వారోత్సవాలు కొనసాగనున్నాయి.

ఈ కార్యక్రమాల్లో భాగంగా తక్కువ బరువుతో జన్మించిన శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందిస్తారు. అంతేకాకుండా ప్రతి శిశువు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను శైశవ్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ యాప్ ద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మెరుగైన వైద్య సంరక్షణ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *