D Spiritual: Nov 17: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు కె.పి. రాఘవన్ మంగళవారం భక్తిశ్రద్ధలతో బంగారు డాలర్‌ను విరాళంగా సమర్పించారు. అమ్మవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఈ కానుకను ఆలయ అధికారులకు అందజేశారు.

0.64 గ్రాముల బరువున్న ఈ బంగారు డాలర్ విలువ సుమారు రూ.10 లక్షలుగా అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, టీటీడీ ఏఈవో దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్ సురేష్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *