D Spiritual: Nov 17: బలిజిపేట మండలం గళావల్లి గ్రామంలోని శ్రీ కామలింగేశ్వర స్వామివారి ఆలయానికి గరివిడి మండలం ఏనుగువలస గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మీసాల అచ్చంనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు రూ.2.02 లక్షల విలువైన కంచు గంటను విరాళంగా అందజేశారు. ఆలయానికి కానుకగా సమర్పించాలనే సంకల్పంతో గంగాడ గ్రామంలోని స్వర్ణకారులకు అవసరమైన నగదును అందించి ప్రత్యేకంగా ఈ గంటను తయారు చేయించారు.

మొదటి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దాతలు కంచు గంటను ఆలయంలో అమర్చారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *