వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తే వివాదాలు ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, పాత కేసులకు సంబంధించి కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉన్నారని వారిని విడుదల చేయాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి పోలీసులను కోరినట్లు సమాచారం.

ఆయన విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పులివెందుల ప్రాంతంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *