TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

Date:

తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అలర్ట్ జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, వాటికి గల కారణాలను టీటీడీ విడుదల చేసింది.

బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే

  • జూలై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • జూలై 17: ఆణివార ఆస్థానం
  • జూలై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
  • జూలై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
  • ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
  • ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ
  • సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • సెప్టెంబర్ 14: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • సెప్టెంబర్ 15 నుండి 23 వరకు: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

పైన పేర్కొన్న పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిర్దేశిత రోజులకు ముందు రోజు తిరుమలలో ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు వెల్లడించారు. కావున, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....