D Spiritual: Nov 19: 21 రోజుల్లో రూ.3.94 కోట్ల ఆదాయం.. 321 గ్రాముల బంగారం, 3.190 కిలోల వెండి కానుకలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 21 రోజుల్లో రూ.3,94,31,637 ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ మహామండపంలోని ఆరో అంతస్తులో కట్టుదిట్టమైన భద్రత నడుమ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం రూ.3,94,31,637 నగదు లభించింది. ఇందులో నోట్ల రూపంలో రూ.3,77,11,637, నాణేల రూపంలో రూ.17,20,000 సమకూరాయి. రోజువారీ సగటు ఆదాయం రూ.18,77,697గా నమోదైంది.

నగదుతో పాటు భక్తులు అమ్మవారికి 321 గ్రాముల బంగారం, 3 కిలోల 190 గ్రాముల వెండిని కానుకలుగా సమర్పించారు. అలాగే రద్దయిన పాత రూ.2 వేల నోట్లు మూడు హుండీలలో లభించాయి. భక్తులు సమర్పించిన కానుకల్లో పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా గుర్తించారు.

విదేశీ కరెన్సీలో అమెరికాకు చెందిన 858 డాలర్లు, థాయిలాండ్‌కు చెందిన 220 బాట్లు, యూఏఈకి చెందిన 105 దిర్హామ్‌లు, సింగపూర్‌కు చెందిన 66 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 56 రియాళ్లు, కెనడాకు చెందిన 30 డాలర్లు లభించాయి. వీటితో పాటు యూరప్‌కు చెందిన 20 యూరోలు, ఒమన్‌కు చెందిన 18 రియాళ్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 15 పౌండ్లు, మలేషియాకు చెందిన 6 రింగిట్లు, కువైట్‌కు చెందిన 6 దినార్లు, ఆస్ట్రేలియాకు చెందిన 5 డాలర్లు కూడా హుండీలలో లభించాయి.

అమ్మవారిపై భక్తులు తమకున్న భక్తి విశ్వాసాలతో సమర్పించిన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కానుకల ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *