
స్కేటింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సిరి ఆకాంక్షించారు. ఇటీవల కాకినాడలో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ రింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించారు.
ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ఎండీ ఇర్ఫాన్ పురుషుల విభాగంలో రింక్ రేస్‌లో కాంస్య పతకం రోడ్ రేస్‌లో రజత పతకం సాధించాడు. అదేవిధంగా అండర్-15 బాలికల విభాగంలో భవిష్య తేజ రోడ్ రేస్‌లో రజత పతకం గెలుచుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కార్యదర్శి అన్నం పునీత చౌదరి సీఈవో పి. సునీల్‌కుమార్ వివరాలను వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ సిరిని కలిసిన క్రీడాకారులను ఆమె అభినందించారు.
జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో రాణించి మరిన్ని పతకాలు సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు జిల్లా స్కేటింగ్ సంఘం సంయుక్త కార్యదర్శి స్రవంతి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
